ఆహ, OTT స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ను గీతా ఆర్ట్స్, మై హోమ్ గ్రూప్ కలిసి సంయుక్తం గా నడిపిస్తున్నారు.  2020 లో ఉగాది పండగ నాడు దీనిని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.  అల్లు అర్జున్ దీని బ్రాండ్ అంబాసడర్. కొత్త సినిమాలతో పాటు, అనేక రకాలైన కొత్త కొత్త కార్యక్రమాలను సైతం ఆహ ప్రేక్షకులకు పరిచయం చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్, బాలకృష్ణ ను హోస్ట్ గ పరిచయం చేస్తూ Unstoppable వంటి ఎన్నో వైవిధ్య భరితహా మైన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు.  అంతే కాకుండా, వారానికి ఒక కొత్త సినిమాని అందిస్తున్నారు.  వెబ్ సిరీస్ లను కూడా లాంచ్ చేశారు.

నేషనల్ ప్లేయర్స్ అయిన అమెజాన్, Netflix, హాట్ స్టార్ ల తో పోటీ పడుతూ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాల తో తెలుగు OTT ప్రపంచం లో వినోదాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

ఇప్పుడు సరికొత్తగా, తమిళ నూతన సంవత్సరం సందర్భం గా, ఆహా ను తమిళ ప్రేక్షకులకు చేరువ చేయడానికి శ్రీకారం చుట్టారు ‘ఆహ’ యాజమాన్యం వారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదు గా దీనిని ప్రారంభించారు.  దీనిలో భాగం గా, మొదటి వెబ్ సిరీస్ ‘ఆకాష్ వాని’  ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగిపోతున్నOTT platform ఆహ కి అభినందనలు.