కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్-2”. నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే 500 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే 100 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను నైజాంలో దిల్‌రాజు విడుదల చేయబోతున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రూ. 50 కోట్లకే నైజాం డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేజీఎఫ్2 మూవీ ఆశించిన స్థాయిలో రాబట్టక పోతే ఆ నష్టాన్ని తదుపరి హోంబలే ఫిలింస్ నుంచి రానున్న సలార్ మూవీతో భర్తీ చేస్తామని హోంబలే ఫిలింస్ యాజమాన్యం ప్రకటించిన్నట్లు సమాచారం. ఏదేమైనా ఇటీవలే RRR సినిమా నైజాం రైట్స్ తో భారీ లాభాలు ఆర్జించిన దిల్ రాజుకు ఇది మరో గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
Recent Comment