మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) కథానాయకుడుగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా నుంచి మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆచార్య ట్రైలర్( Acharya Trailer ) ని ఈ ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ని అందించారు మేకర్స్. ‘ఆచార్య’ మూవీ ట్రైలర్ ని థియేటర్స్ లో కూడా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
Recent Comment