నటుడు, నిర్మాత, దర్శకుడు, కథా రచయిత బాలయ్య యూసఫ్ గూడ లోని తన నివాసం లో శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. చిత్ర పరిశ్రమ లో విషాద ఛాయలు.  ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  పుట్టిన రోజు (9th April) నాడే బాలయ్య గారు కన్ను మూయడం మరింత విషాదాన్ని మిగిల్చింది.

స్పష్టమైన వాచకం తో సాంఘిక, పౌరాణిక, జానపద   చిత్రాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.  బాలయ్య సుమారు ౩౦౦ సినిమాల లో నటించారు.  నటుడు, నిర్మాత, దర్శకుడు, కథా రచయిత గా అద్భుతమైన ప్రతిభను కనపరిచారు.

తన సొంత నిర్మాణ సంస్థ అమృత ఫిలిమ్స్ బ్యానర్ పై చెల్లెలి కాపురం, నేరము-శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట వంటి చిత్రాలను నిర్మించారు.  ఊరికిచ్చిన మాటకు ఉత్తమ కథా రచయిత గా నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి ఉత్తమ నిర్మాత గా నంది అవార్డు అందుకున్నారు.

రజని కాంత్ వఫాదార్ చిత్రానికి రైటర్ గా పని చేశారు. శ్రీ రామ రాజ్యం లో వశిష్ఠుడి పాత్ర పోషించారు.  2013 తరవాత ఆయన సినిమాలలో నటించడం మానేశారు