దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR).
‘ఆర్ఆర్ఆర్’ (RRR) విడుదలైన అన్ని ఏరియాల లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక లాభాల లెక్కలు తేలాలి. తెలుగు రాష్ట్రాల లో 200 కోట్లకు పైగా వసూలు చెసింది ఇప్పటికే. నైజాం లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది. దిల్ రాజు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీం కు పార్టీ కూడా ఇచ్చాడు.
బాలీవుడ్ లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సోమవారానికి అంటే 4th ఏప్రిల్ నాటికి 190 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. అయితే ఈ వీక్ డేస్ లోనే 200 కోట్ల మార్క్ దాటుతుంది. వారాంతం లో వసూళ్లు పెరిగి, తరవాతి వారం లో పబ్లిక్ హాలిడేస్ వరసగా ఉన్నాయ్. వీటిని బట్టి చూస్తే 250 కోట్లకు పైగా వసూలు చేయవచ్చు.
దక్షిణాది నుండి వచ్చిన ఒక సినిమా బాలీవుడ్ లో ఇన్ని కోట్లు వసూలు చేయడం, బాహుబలి-2 తరువాతి స్థానం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మాత్రమే
Recent Comment