దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతగా 19 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 18వ రోజుతో చూసుకుంటే 19వ రోజు వసూళ్లు కాస్త తగ్గాయి.. 18వ రోజుకు గాను 81 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా 19వ రోజు 64 లక్షలు రాబట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా ఈ 19 రోజుల్లో 259.77 కోట్ల షేర్ 391.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే విడుదలైన ఈ 19 రోజుల్లో 571.11 కోట్ల నెట్, 1046.10 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినాట్లు సమాచారం. రిలీజ్ కు ముందు 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ ప్రస్తుతం 124 కోట్ల లాభాలతో కొనసాగుతోంది.