Gali Nageshwara Rao :
పాయల్ రాజ్‌పుత్‌తో రొమాన్స్‌ చేయనున్న మంచు విష్ణు!

టాలీవుడ్‌ హీరో, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. గాలి నాగేశ్వరరావు(Gali Nageshwar Rao) టైటిల్ తో రానున్న ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో మంచు విష్ణుకి జోడిగా పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను విభిన్నంగా ప్రారంభించేశారు. మంచు విష్ణు, పాయల్ రాజపుత్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

“గాలి నాగేశ్వరరావుగా సరికొత్త పాత్రను చేయబోతున్నాను.. ఈ సినిమా విషయాలను పంచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాను అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ఇక మరో పాయల్ రాజ్ పుత్ కూడా గాలి నాగేశ్వరరావు చిత్రంలో స్వాతి పాత్రను పోషిస్తున్నాను. అని ట్వీట్ చేసింది. జి.నాగేశ్వ‌ర రెడ్డి స్క్రిప్ట్ అందించిన ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా చోటా. కె.నాయుడు వ్యవహరిస్తున్నారు. అలాగే భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే, డా. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరించనున్నారు.