వైస్సార్సీపీ (YSRCP) నాయకులకు ఎందుకు ఇంత ఉలికిపాటు. తెలుగు దేశం(Telugu Desam), జనసేన(Jana Sena) , బీజేపీ(BJP) పార్టీ లు ఏమి చేసిన, వారికీ ఎవరు మద్దతు పలికిన ముందుగా వైస్సార్సీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. 

మా నాయకుడికి ప్రజల మద్దతు ఉంది. ప్రజలు మా వైపు ఉన్నారు.  అని వైస్సార్సీపీ నాయకులూ పోటీపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు.  అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రచారం నిర్వహిస్తారు, జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని వారి ధీమా కావచ్చుగాక.  మిగతా వారందరు ప్రెస్ మీట్ లకే  పరిమిత మవుతున్నారు.  కూటమి లో  ఏమి జరుగుతోంది.  ఎవరు ఏమి మాట్లాడుకుంటున్నారు. ప్రెస్ మీట్లు ఎపుడు పెడదాము అని.  వీళ్లకు టీవీ 9 (TV9) వాళ్ళు వంత పాడుతున్నారు. 

ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి.  గెలిచినవారు అధికారం చేపడతారు.  అది అధికార పార్టీ కావచ్చు కూటమి కావచ్చు.  చిరంజీవి (Chiranjeevi) గారు అన్న ఒక్క మాటకు లో ఎంత ఉలికిపాటు చూడండి. మొదట ఉలిక్కి పడే వ్యక్తి సజ్జలగా (Sajjala) రు.  అభివృద్ధి చేసిన వారికి ఎవరు ఎవరికీ మద్దతిస్తే ఏంటి. అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ప్రెస్ మీట్లు పెట్టి వారిని వీరిని విమర్శించడం ఎందుకు.

ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడడం లేదు

మద్యపాన నిషేధం గురించి ఎందుకు మాట్లాడడం లేదు

పోలవరం గురించి ఎందుకు మాట్లాడడం లేదు

వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసు ఎప్పటికి తేలుతుంది 

జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) గారి చెల్లెలు షర్మిల(Sharmila), వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అన్ని మాట్లాడుతుంటే,  వాటికి సమాధానం ఇవ్వలేని సజ్జల గారు మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు.

ఏది ఏమైనా పిఠాపురం లో ఈ సారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలుపు తథ్యం. 

అయితే ఒకటి గమనించాలి.  పొరపాటున వైస్సార్సీపీ గెలిస్తే తరవాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మరి ముఖ్యంగా ఈనాడు (Eenadu) టీం అప్రమత్తంగా ఉండాలి