పాన్ ఇండియా సినిమా ‘లైగర్‌’(Liger) తర్వాత రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda), అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌(Puri Jagannadh) కాంబినేషన్‌లో ‘జనగణమన’ (Janaganamana)అనే మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్‌ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘లైగర్’ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరి జగన్నాథ్ వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.

ఈ క్రమంలోనే ‘జనగణమన’ సినిమా గురించి సోషల్ మీడియా వేదిక గా విజయ్ దేవరకొండ తాజాగా ఒక పోస్ట్ చేసాడు. మార్చి 29, 2022 (మంగళవారం) ఈ సినిమాకి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించాడు. అయితే లైగర్ మూవీ రిలీజ్ అవడానికి ముందే ముందే ఈ సినిమాను ప్రారంభించడం విశేషం. కాగా, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మిలిటరీ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే లైగర్ కోసం పొడవాటి జుట్టుతో కనిపించిన విజయ్.. జనగణమన కోసం మిలట్రీ హెయిర్ కట్ లోకి మారిపోనున్నాడు.