దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటీవలే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.

అయితే ఈ సినిమా బాలీవుడ్ లో కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సోమవారం నాడు మరో 3.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటి వరకూ 235 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ లో బాహుబలి 2 తర్వాత ఈ సినిమానే అత్యధిక కలెక్షన్స్ సాధించడం విశేషం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా జోరు చూస్తుంటే అక్కడ 250 కోట్ల రూపాయల మైలురాయిని సునాయాసంగా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఈ సినిమా యూఎస్ లో 13.5 మిలియన్ డాలర్ల కి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.