బర్రెలక్క మళ్ళీ నామినేషన్ వేశారు. ఈ సారి ఏకంగా నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.  

తెలంగాణ వాసి అయిన కర్నె శిరీష ( బర్రెలక్క గా ఫేమస్) బి కామ్ చదివింది.

2023 తెలంగాణ ఎలక్షన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గం లో, మ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.  నిరుద్యోగుల తరపున పోరాడతానని బరిలో దిగిన బర్రెలక్క కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో ఓడిపోయింది . విజిల్ గుర్తు తో బరిలో దిగిన బర్రెలక్క కు ఐదు వేలకు పైగా ఓట్లు వచ్చాయి.  అయితే సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం మరియు మద్దతు లభించాయి.

గతంలో డిగ్రీ చదివినా ఉద్యోగం రాలేదని అందుకే బర్రెలు కాస్తున్నాని సోషల్ మీడియా లో వీడియో షేర్ చేశారు.  అప్పటినుంచి బర్రెలక్క గా ఫేమస్ అయ్యారు

ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థానానికి నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు అందించారు. 

ఈ సారి తనను గెలిపిస్తే, నిరుద్యోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు.

బర్రెలక్క కు వార్త వినోదం తరపున అల్ ది బెస్ట్