ఆంద్రప్రదేశ్ లో సీఎం జగన్ గారు అమలు పరుస్తున్న పథకాలలో అమ్మ ఒడి ఒకటి. ఈ పథకం కింద లబ్ధిదారులకు డబ్బులు అందుతున్నాయి. ఇక ఆంద్రప్రదేశ్ లో చేస్తున్న అమ్మ ఒడి పథకం ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని YSR CP మంత్రి ఆది మూలపు సురేష్ తెలిపారు. దీనిపై జరుగుతున్న ఆరోపణలపై మంత్రి ఆదిమూలపు సురేష్ మండి పడ్డారు. తెలుగుదేశం నాయకులు
లోకేష్ , ఆయన తండ్రి చంద్ర బాబు జగన్ పథకాలపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎల్లో మీడియా అమ్మ ఒడి పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఇది కరెక్ట్ కాదని తెలిపారు.

దేశం మొత్తం అమ్మ ఒడి పథకాన్ని మెచ్చుకుంటున్నారని తెలియచేసారు. పేద విద్యార్థులకు సహాయపడేలా జగన్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుని అమలు చేస్తున్నారని చెప్పారు.అమ్మ ఒడికి కొత్త నిబంధనలు తెస్తున్నాం అనేది తప్పుడు ప్రచారం అని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే ప్రజలకు పథకాలు నేరుగా అందుతున్నాయని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు ప్రజలకు చేరుతున్నాయని అలాంటి అమ్మ ఒడి పథకం ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం మానుకోవాలని సూచించారు. అమ్మ ఒడి పథకం మీద ప్రజలకు ఎలాంటి సందేహాలు వద్దని హామీ ఇచ్చారు.