పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘జనగణమన’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు..ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఆగస్టు 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2022లో షూటింగ్ ప్రారంభంకానుంది.
అయితే ఈ చిత్ర యూనిట్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే సినిమా ఛార్మి తదితరులు భారత రక్షణా శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ని కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. “జనగణమన” మేకర్స్ రాజనాథ్ సింగ్ ని కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలాఉంటే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
Recent Comment