Radhe Shyam: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు. అయితే మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ల రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
★నైజాం : 24.80 కోట్లు
★సీడెడ్ : 7.46 కోట్లు
★గుంటూరు : 4.50 కోట్లు
★ఉత్తరాంధ్ర : 4.90 కోట్లు
★తూర్పు గోదావరి : 4.34 కోట్లు
★పశ్చిమ గోదావరి : 3.32 కోట్లు
★కృష్ణ : 2.71 కోట్లు
★నెల్లూరు : 2.14 కోట్లు
అలాగే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 54.17 కోట్లు (84.60కోట్ల గ్రాస్) వాసులు చేయగా.. తమిళనాడులో 0.76 కోట్లు,
కేరళలో 0.18 కోట్లు, కర్ణాటకలో 4.20 కోట్లు, హిందీలో 10.70 కోట్లు, ఓవర్సీస్ లో 11.42 కోట్లు వసూలు చేసింది. రాధేశ్యామ్ మూవీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 83.12 కోట్లు (151కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఈ సినిమాకి రూ. 208 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫైనల్‌గా రూ.83.12 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.
Recent Comment