రేపే జగన్ కేబినెట్ భేటి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం. రేపటి సమావేశానికి 40 అంశాలతో కూడిన అజెండా ను తయారు చేశారు.  కేబినెట్ భేటి కావడం కొత్తేమీ కాదు. కాని ఈ సారి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.  జగన్ మొదటి బ్యాచ్ కేబినెట్ రెండున్నర సంవత్సరాల పదవి కాలం ముగియనుంది.  ప్రస్తుత కేబినెట్ కు ఇదే చివరి కేబినెట్ భేటి.  తరవాత మంత్రులందరూ రాజీనామా చేస్తారు.  ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ తో జగన్ చర్చించారు.  ఇప్పుడున్న మంత్రు లలో ఇద్దరు మాత్రమే కొనసాగుతారు.

ఈ సారి జగన్ కేబినెట్ 2024 ఎన్నికలే లక్ష్యం గా తయారవుతోంది.  ఇందులో భాగంగానే, నటి, ఎమ్మెల్యే అయిన రోజా కు, మంత్రి పదవి ఖాయం అని తెలుస్తోంది.  అందుకే ఈ మధ్య ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ లో జడ్జి సీట్ లో కనిపించడం లేదు.  ఈ మధ్య టీవీ9 డిబేట్ లో పేర్ని నాని లాస్ట్ వర్కింగ్ డే అని వ్యాఖ్యలు చేయడం. కొత్త కేబినెట్ లో ఎవరెవరికి బెర్త్ లు దొరుకుతాయి అనేది చాలా ఆసక్తికరం గా మారింది.

మరో ఐదు రోజుల్లో పునర్ వ్యవస్థీకరణ 10 న కొత్త మంత్రులకు సమాచారం ఇస్తారు. 11 న మంత్రి వర్గ విస్తరణ. మంత్రి వర్గ విస్తరణలో భాగం గా 23 మంది కి అవకాశం రావచ్చు.  కొత్తగా ఏర్పాటైన జిల్లాల తో పాటు 26 జిల్లాల అభివృద్ధి లక్ష్యం గా మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు. అయితే మంత్రి పదవులు పోయిన వారందరికీ పార్టీ కి సంబంధించిన బాధ్యతలు అప్పగించవచ్చు