ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన 12 రోజుల పాటు కలెక్షన్ల సునామీ సృష్టించి 13వ రోజుకు వచ్చే సరికి మాత్రం ఊహించని డ్రాప్ కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజుకు గాను ఈ సినిమా 2.54 కోట్ల షేర్, 4 కోట్లు గ్రాస్‌‌ మాత్రమే రాబట్టింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ 13 రోజుల్లో ఆర్ఆర్ఆర్ మూవీ 246.90 కోట్ల షేర్, 371 కోట్లు గ్రాస్ రాబట్టింది.

(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ 13 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్..

★తొలి రోజు – 74.11 కోట్లు
★రెండో రోజు – 31.63 కోట్లు
★ మూడో రోజు – 33.53 కోట్లు
★ నాలుగో రోజు – 17.73 కోట్లు
★ ఐదో రోజు – 13.63 కోట్లు
★ ఆరో రోజు – 9.54 కోట్లు
★ ఏడో రోజు – 7.48 కోట్లు
★ ఎనిమిదో రోజు – 8.33 కోట్లు
★ తొమ్మిదో రోజు – 19.62 కోట్లు
★ పదో రోజు – 16.10 కోట్లు
★ పదకొండో రోజు11- 4.98 కోట్లు
★ పన్నెండో రోజు- 4.88 కోట్లు షేర్
★పదమూడో రోజు- 2.54 కోట్లు షేర్ (4 కోట్లు గ్రాస్‌)

మొత్తంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలిపి 13 రోజుల్లో528.50 కోట్లు షేర్‌, ( 951.50 కోట్ల గ్రాస్‌) కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఈ సినిమా హిందీలో 99.50 కోట్లు, కర్నాటకలో 39.30 కోట్లు ,రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.85 కోట్లు, అలాగే తమిళనాడులో 35.50 కోట్లు, కేరళలో 9.85 కోట్లు, ఓవర్సీస్‌లో 90.05 కోట్లు వసూలు చేసింది.