దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR) మూవీ ప్రస్తుతం సినీ ప్రపంచాన్ని ఉపేస్తోంది. సూపర్‌ హిట్‌ టాక్‌తో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ​ నటనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి అద్భుత సృష్టిని చూసి అందరూ సంబరపడిపోతోన్నారు. ఈ క్రమంలోనే అభిమానులు, సినీ సెలెబ్రిటీలు ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ శంకర్(Shankar) కూడా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఒక కొత్త సరికొత్త అర్థాన్ని చెబుతూ మాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా అనుభూతిని ఇచ్చినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా రామ్ చరణ్ రేజింగ్ పెర్ఫార్మన్స్ అలాగే తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని. చివరగా హ్యాట్సాఫ్ మహా ‘రాజమౌళి’ గారు అంటూ శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.