ఆంధ్రప్రదేశ్ (Ap )మాజీ మంత్రి అనిల్ కుమార్ (Anil Kumar )తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. నెల్లూరు వేదికగా వైసీపీ రాజకీయం సరికొత్తగా హీట్ ఎక్కుతోంది. నెల్లూరులో రేపు జరగబోతున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌(Anil kumar ) దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఈ సభ విజయవంతం కావాలని తన అనుచరులకు తెలిపారు.అక్కడకి వచ్చిన ప్రజలకు రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నెల్లూరు లోని గాంధీ బొమ్మ సెంటర్‌కు అనిల్ కుమార్‌తో పాటు ఇతర నాయకులు వచ్చారు. అనిల్ ,కాకాణి(Kakani ) మధ్య విభేదం ఎక్కువ అవుతోంది. మంత్రి కాకాణిని కాదని ,అనిల్ తగ్గకుండా సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఎవరికి తగ్గమని అనిల్ తెలిపారు.

ఈ సభ ఎవరికి పోటీ కాదని , మూడు రోజులకు క్రితమే సభకోసం అనుమతి అడిగినట్టు తెలిపారు.ఇక ముఖ్యమంత్రి జగన్‌కు(Ys Jagan ) కార్యకర్తగా ఉంటానని చెప్పారు. సభ వాయిదాపై అధిష్టానం ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని మంత్రి కాకణి సభకు ఇది పోటీ కాదని అనిల్ (Anil Kumar )తెలిపారు