మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’(Acharya) ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఆచార్య మూవీ ట్రైలర్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఈ క్రమంలో ఆచార్య సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రొడ్యూసర్ అన్వేష్ రెడ్డి వెల్లడించారు. ఆచార్య మూవీ ట్రైలర్ ను విడుదలకు రెండు వారాల ముందు మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు. అలాగే విడుదలకు వారం రోజుల ముందు అంగరంగ వైభవంగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. కాగా, ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదల కానుంది.