మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). మొదటి చిత్రం ‘గంగోత్రి’ నుంచి మొన్న వచ్చిన ‘పుష్ప’ వరకూ అల్లు అర్జున్ చేసిన ప్రతి సినిమాలో ఓ కొత్తదనం ఉంటుంది. అటు మాస్ ఇటు క్లాస్ ఫ్యాన్స్ అందరిని అలరిస్తూ టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడుగా ఎదిగాడు. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈరోజుతో ఆయన 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీనటులు, సెలెబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా తన బన్నీ కోసం చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది ‘”హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే నిబద్దత, పట్టుదలే నీకు విజయాలు దక్కేలా చేస్తోంది. ఈ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో” అని మెగా స్టార్ ట్వీట్ చేశారు. ఇక చిరంజీవి చేసిన ఈ ట్వీట్‌పై అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా,బన్నీ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి ఇటీవలే సెర్బియాకు వెళ్లినట్లు సమాచారం.
Recent Comment