దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా తొలి ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.715 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదిలాఉంటే, ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ పై ఈ చిత్రానికి కథను అందించిన ప్రముఖ రచయిత.. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తమ ఇంటికి వచ్చారనిరట. ఆ సమయంలో ఎన్టీఆర్, రాజమౌళి, తాను ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి చర్చించారట. ఈ క్రమంలోనే వారిద్దరికీ తాను కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగిందని.. ఆ పాయింట్స్ రాజమౌళి, ఎన్టీఆర్‌కు బాగా నచ్చయని.. దేవుడు అనుగ్రహిస్తే త్వరలోనే ఆర్ఆర్ఆర్ 2 తెరకెక్కే ఛాన్స్ ఉందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తే.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అలరించారు.
Recent Comment