కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’(Vikrant Rona Movie). అనూప్ భండారి దర్శకుడు. త్రీడీలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మించారు. ఈ సినిమాలో నీతా అశోక్, నిరూప్ భండారి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో నటించారు. దాదాపు 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 2, 2022న ఉదయం 09:55 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘విక్రాంత్ రోణ’ తెలుగు టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే మలయాళ వెర్షన్‌ను మోహన్‌లాల్ విడుదల చేయనున్నారు. ఇక ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటిస్తారని సమాచారం. అయితే సినిమాకు సంబంధించి భారీ అప్‌డేట్స్‌ను ఇస్తూ అంచనాలను అమాంతం పెంచుతూ వస్తున్న ఈ చిత్రం.. త్రీ డీలో ఎలాంటి అనుభూతిని ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు .
Recent Comment