మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) శంకర్ (Shankar) కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer) ఈ మధ్యనే రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఫస్ట్ లిరికల్ వీడియో ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని(Anil Thadani) , ఈ చిత్రం నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను సుమరు 75 కోట్ల రూపాయలకు తీసుకున్నారని తెలిసింది.
భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి దిల్ రాజు (Dil Raju) నిర్మాత. తమన్ (Thaman) సంగీతం. కియారా అద్వానీ కథానాయికా. ఈ చిత్రం లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల నుంచి జరుగుతోంది. మొదటి పాట ‘జరగండి’ కి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
శంకర్ మార్క్ కంటెంట్, రామ్ చరణ్ నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని తెలిసింది.
అనిల్ తడాని గేమ్ ఛేంజర్ తో పాటు పుష్ప-2 (Pushpa) మరియు దేవర (Devara) నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు
Recent Comment