యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కథానాయకుడుగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. ఉపేంద్ర‌(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), న‌వీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapati Babu) త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. . కాగా, ఈ సినిమాలో వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. అందులోని వరుణ్‌ తేజ్ మాస్‌ లుక్‌ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇటీవ‌లే ‘గ‌ని’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన వ‌రుణ్ తేజ్ తాజాగా త‌న తరువాతి సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ‘గుంటూరు టాకీస్’ ఫేం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో జరిగాయి. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌రా సినీచిత్ర బ్యాన‌ర్‌పై బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో నాగ‌బాబు క్లాప్ కొట్ట‌గా.. అయన సతీమణి ప‌ద్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.