రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarakonda) కథానాయకుడుగా స్టార్ డైరెక్టర్ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’(Liger) సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా, స్పోర్ట్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్‌ సినిమా ఆగస్ట్‌25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న లైగర్‌ మూవీ రికార్డులను బద్దలు కొడుంతుందని విజయ్‌ దేవరకొండ అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే విజయ్‌ దేవరకొండ ఓ అరుదైన రికార్డు సాధించాడు. తాజాగా అతి తక్కువ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను సాధించిన దక్షిణాది హీరోగా ఘనత సాధించాడు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండకు 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ కంటే ముందు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 18 మిలియనల్ ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత 8.3 మిలియన్లతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ఉన్నాడు. ఈ జాబితాలో ప్రభాస్ కంటే ముందు విజయ్ దేవరకొండ ఉండడం విశేషం