మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా న‌టించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే పాత్ర‌లో న‌టించారు. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల‌ కానుంది. ఇటీవల విడుద‌లైన సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు, టీజర్ ట్రైల‌ర్‌కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఇక థియేట‌ర్స్‌లో చిరంజీవి, రామ్ చరణ్ క‌లిసి చేసే సంద‌డిని చూడ‌టానికి మెగాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ‘ఆచార్య’ మూవీ ప్ర‌మోష‌న్స్‌ వెవంతం చేసింది. ఈ క్రమంలోనే చిరంజీవి , రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేసిన ‘భలే భలే బంజారా..’ అనే పాటను సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేశారు మేకర్స్. మ‌ణిశ‌ర్మ సంగీత స్వరాలు సమకూర్చిన ఈ పాటకు తండ్రి కొడుకులు కలిసి వేసిన స్టెప్పులు దుమ్మురేపాయి. రామ‌జోగ‌య్య‌శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాట‌ను శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కాగా, ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది.