ఉత్కంఠభరిత పోరులో, భారత మహిళల జట్టు పై దక్షిణ ఆఫ్రికా ఘన విజయం

న్యూజిలాండ్ లో, భారత, దక్షిణ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణ ఆఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.  కీలక మ్యాచ్ లో, ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మందాన అద్బుతం గా ఆడి మొదటి వికెట్ కు 91 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించారు.

షెఫాలీ వర్మ 53 పరుగులు, స్మృతి మందాన 71 పరుగులు చేశారు.  కీలక మ్యాచ్ లో కెప్టెన్ మిథాలీ రాజ్ 68 పరుగులతో, హర్మాన్ ప్రీత్ కౌర్ 48 పరుగులతో రాణించారు.

అనంతరం 275 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణ ఆఫ్రికా ఆదిలోనే వికెట్ కోల్పోయిన  లారా వల్వర్ట్, లారా గుడాల్ రెండవ వికెట్ కు 124 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు.

మిగనోం డు ఫ్రీజ్ 52 పరుగులతో చివరివరకు నిలిచి దక్షిణ ఆఫ్రికాను గెలిపించింది.  అయితే మధ్యలో,  క్లోయె ట్రీన్ 9 బంతుల్లో చేసిన 17 పరుగులే భారత్ కు గెలుపును దూరం చేశాయి.

భారత బౌలర్ల లో గైక్వాడ్, హర్మాన్ ప్రీత్ కౌర్ తలా రెండు వికెట్లు తీయగా, ముగ్గురు దక్షిణ ఆఫ్రికా విమెన్ బ్యాట్స్మన్ రన్ అవుట్ అయ్యారు.

ఆఖరి ఓవర్ లో దీప్తి శర్మ నో బాల్ కొంప ముంచింది. ప్రపంచ కప్ నుంచి భారత్ నిష్క్రమణ.  ఆరవ ప్రపంచ కప్ లో ను నెరవేరని మిథాలీ రాజ్ కల