ఈసారి తెలుగు సినిమా, వేసవి సీజన్ ను క్యాష్ చేసుకోలేక పోయింది. 

2024, సంక్రాంతికి 4 నాలుగు సినిమాలు విడుదలవగా, సమ్మర్ సీజన్‌లో పెద్ద స్టార్ సినిమాలు ఏమి లేక థియేటర్ లు వెల వెలబోతున్నాయి.  మొదటి నాలుగు నెలల్లో (2024), 10 సినిమాల దాక విదుదలయ్యాయి. అయితే హనుమాన్, టిల్లు స్క్వేర్ సినిమాలు సూపర్ హిట్ స్టేటస్ ను అందుకున్నాయి.  మహేష్ బాబు గుంటూరు కారం తో అలరించాడు.

అయితే రెండో అర్ధ భాగం లో పోటీ రసవత్తరంగా ఉండబోతుంది.  ప్రేక్షకులు ఆసక్తి గా గమనిస్తూ వేచి చూస్తున్న చిత్రాలన్నీ, కొన్ని రోజుల లేదా నెలల వ్యవధి లో రాబోతున్నాయి.

కల్కి, పుష్ప, ది రూల్, విశ్వంభర, గేమ్ ఛేంజర్, దేవర, ఇండియన్ 2, కంగువ. రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకోవడం, థియేటర్ల సర్దుబాటు వంటి వాటిపై, ముందు ప్లాన్ చేసుకోవాలి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ ఎలక్షన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి భాగం లో, మరి 2024 రెండవ భాగం లో ఇండియన్ సినిమా ప్రీమియర్ లీగ్.

రాబోయే రోజులు బాక్స్ ఆఫీస్ కాసుల వర్షం తో కళకళ లాడబోతోందన్నమాట