దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. (RRR) ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలై కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
అయితే విడుదలకు ముందే పలు రికార్డులను సాధించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తర్వాత అనేక రికార్డులను ఖాతాలో వేసుకుంటుంది. ఈ క్రమంలోనే తనకు అద్భుత విజయాన్ని అందించిన దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్‌తో పాటుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ కు కృతఙ్ఞతలు చెబుతూ లేఖ రాశారు ఎన్టీఆర్. “నా లోని అత్యుత్తమ నటుణ్ని బయటికి తీసిన దర్శకుడు రాజమౌళికికు ధన్యవాదాలు. అయన నన్ను నటుడిగా మరో మెట్టు ఎక్కించావు. ఇక నా బ్రదర్ రామ్ చరణ్ లేకపోతే ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే లేదు. అల్లూరి సీతారామరాజు పాత్రలో జీవించాడు. ‘ఆర్ఆర్ఆర్’ అనేది సినిమా మాత్రమే కాదు అనేక భావోద్వేగాల సమ్మేళనం. ఈ నీటికి నిప్పులా తోడైనందుకు కృతఙ్ఞతల ” అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

Recent Comment