తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr)గారు మరో సారి ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు కేసీఆర్ (Kcr ) గారు అన్ని చర్యలు చేపడుతున్నారు.ఈ వారంలోనే వెళ్లనున్నట్లు సమాచారం. వారం రోజులకు పైగా అక్కడే ఉండి జాతీయ రాజకీయాలు, రైతు సమస్యలపై మేధావులు, రైతు సంఘాలతో చర్చించనున్నట్లు సమాచారం. నల్లచట్టాలపై జరిగిన రైతు ఉద్యమంలో మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థికసాయం కూడా అందజేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే TRS సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఇక నేషనల్ పాలిటిక్స్ మీద కేసీఆర్(Kcr ) గారు చాలా రోజుల నుండి దృష్టి పెట్టారు .ఈసారి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఢిల్లీలో ఇతర రాష్ట్రాల రైతు సంఘాలతో పాటు , పొలిటికల్ నాయకులను కలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు తేవడానికి అనేక చర్చలు చేయబోతున్నారు.అందరూ కలిసి తమకి కావాల్సిన పనులు కేంద్రం నుండి ,బీజేపీ (BJP )నాయకుల నుండి చేపించుకోవలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సిఎం మళ్ళీ ఢిల్లీకి ప్రయాణం కావడంతో దేశ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.
Recent Comment