గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్ల లో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.  శుభమన్ గిల్  చెలరేగి పోయాడ్డు. కేవలం 46 బంతుల్లో, నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్ల సహాయంతో 84 పరుగులు చేశాడు.  హార్దిక్ పాండ్య 31 పరుగులు, డేవిడ్ మిల్లర్ 20 పరుగులు చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో ముస్తాఫిజుర్ రెహమాన్ 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు