చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఓపెనర్ రాబిన్ ఉతప్ప కేవలం 50 బంతుల్లో 88 పరుగులు (4×4|6×9) చేశాడు.  శివం దూబే కేవలం 46 బంతుల్లో 95 పరుగులు (4×5|6×8) చేశాడు.  మరో ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ 17 పరుగులు చేయగా, మొయిన్ అలీ 3 పరుగులు చేశాడు.  కెప్టెన్ జడేజా డక్ ఔట్ అయ్యాడు.

రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు బౌలర్ల లో హాసరంగా రెండు వికెట్లు తీయగా, హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.  అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు 7.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ నలుగురు అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు