బుల్లితెర యాంకర్‌ సుమ కనకాల(Anchor Suma) తాజాగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ (Jayamma Panchayathi). ఈ సినిమాకు విజయ్‌ కలివారపు దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను బలగ ప్రకాశ్‌ నిర్మించారు.

అంతకుముందు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ విడుదల చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి, అలాగే నేచురల్ స్టార్ నాని రిలీజ్‌ చేసిన తొలి పాటకి, యువ హీరో రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు ,అలాగే దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆవిష్కరించిన టైటిల్‌ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది.అయితే ఈ సినిమా మే 6న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్రబృందం. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan) శనివారం ఉదయం 11:07 గంటలకు ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబందించిన సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.