మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్‌ 29, 2022న విడుదలకానుంది. అలాగే మెహర్ రమేష్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘భోళా శంకర్‌’ మోహన రాజా డైరక్షన్ లో చేతున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే చిరంజీవి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 154వ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ నటించనుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు.

కాగా ,ఇందులో మాస్ మహారాజా రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రవితేజకు జోడిగా తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో చిరంజీవి, రవితేజ అన్నదమ్ముల పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రవితేజ పాత్ర వస్తుందని.. సినిమాను డ్రైవ్ చేసే పాత్రగా రవితేజ రోల్ ఉండబోతుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో రవితేజ పాత్ర మరణిస్తుందని, ఈ సంఘటన ద్వారానే చిరంజీవి పాత్రలో చాలా మార్పులు వస్తాయని సమాచారం. కాగా, 2000 ఏడాదిలో వచ్చిన బ్లాక్ బస్టర్‌ మూవీ ‘అన్నయ్య’లో చిరంజీవి, రవితేజ, వెంకట్‌ అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే.