నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. తన తాజా చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ సినిమా చిత్రీకరణని ఇటీవల పూర్తి చేసిన నాని తన తదుపరి చిత్రం ‘దసరా’(Dasara)కు ఇప్పుడు టైమ్ కేటాయించనున్నారు. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయినా గా నటిస్తుంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరినా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించినప్పుడే ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అని అందరికీ తెలిసిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన “స్పార్క్ ఆఫ్ దసరా” అంటూ ఒక మాస్ పోస్టర్ తో ఆదివారం ఉదయం 11 గంటల 34 నిమిషాలకు బిగ్ అప్‌డేట్ ను ఇవ్వనున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. మరి ఈసినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారా లేక గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Recent Comment