సీనియర్ దర్శకుడు మోహన్‌రాజా(Mohan Raja) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) గాడ్‌ఫాదర్‌(God Father) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కీలక పాత్రలో నటించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ల‌పై కీలక స‌న్నివేశాలు తెరకెక్కించారు. అయితే ఈ షెడ్యూల్ తో ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్త‌యింద‌ట‌. ఈ సంద‌ర్భంగా దర్శకుడు మోహ‌న్‌రాజా సల్మాన్ ఖాన్ కు ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్ చేశాడు. కాగా, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.