యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్‌ 2 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను సృష్టింస్తోంది. ఇక‌ ఇప్ప‌టికే ఈ చిత్రం కేవ‌లం ప్రీ బుకింగ్స్‌తోనే దాదాపు 60కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా తొలిరోజు ఎంత కలెక్షన్స్ సాధించిందో ఇప్పుడు చూద్దాం..

అయితే తాజా సమాచారం ప్రకారం తొలి రోజున ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్ష‌న్స్‌ను కేజీయఫ్‌ 2 దాటేయయలేదని తెలుస్తోంది. కేజీయఫ్‌ 2 సినిమాకు తొలి రోజున రూ.150 కోట్లు రాగ.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి తొలిరోజున రూ.223 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీన్ని బట్టి RRR తొలిరోజు వసూళ్లను KGF 2 బ్రేక్ చేయలేదని తెలుస్తోంది. కాగా, KGF 2 సినిమాకు తొలిరోజు కర్నాటకలో రూ.35 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.33 కోట్లు, బాలీవుడ్‌లో రూ.63 కోట్లు, తమిళనాడులో రూ.12 కోట్లు, కేరళలో రూ.7.50 కోట్లు మొత్తంగా చూస్తే ఈ సినిమాకు రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.