పాకిస్థాన్ మాజీ కెప్టెన్, రమీజ్ రాజా  భారత, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో మెగా టోర్నీప్రతిపాదించిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రతిపాదనను, ICC తిరస్కరించింది. ఐసీసీ బోర్డు సమావేశం లో రమీజ్ రాజా ప్రతిపాదన కు ఎవరు మద్దతు ఇవ్వలేదు. మరో వైపు బీసీసీఐ కూడా రమీజ్ రాజా ప్రతిపాదన కు సుముఖం గా లేదు.

ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగర్ బార్ క్లే, ఈ నవంబర్ వరకు కొనసాగుతారు. ఆ తరవాత కొత్త చైర్మన్ ఎంపిక కసరత్తు మొదలవుతుంది. అయితే భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ పడబోతున్నట్లు సమాచారం

రమీజ్ రాజా ప్రతిపాదన : భారత, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో మెగా టోర్నీ నిర్వహించాలని, దాని ద్వారా 750 మిలియన్ డాలర్ల ఆదాయం కూడా వస్తుందని అంచనా వేశాడు. ఇప్పటి వరకు నాలుగు దేశాలతో టోర్నీ ICC కూడా నిర్వహించలేదు