దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే RRR చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో విడుదల కానుంది.

ఈ అంశాన్ని తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెర్రీ మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మరో 30 దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ మూవీ అక్టోబర్‌లో జపాన్‌లో రిలీజ్ కానుందని, ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తాను, ఎన్టీఆర్‌, రాజమౌళితో పాటుగా ఇతర చిత్రబృందం జపాన్ దేశాన్ని సందర్శిస్తామని రామ్ చరణ్ పేర్కొన్నాడు. ఇక ఈ విషయంపై త్వరలోనే చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.