మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎప్పటినుంచో వేచి చూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దింతో సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్, సినీ సెలెబ్రెటీలు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు రాజమౌళి మీద ఊహించని రీతిలో పొగడ్తల జల్లు కురిపించాడు.
“మీరు పక్కనే వున్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో వున్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్.. మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే..” అంటూ అదిరిపోయేలా ప్రశంసలు వర్షం కురిపించాడు సుకుమార్. ప్రస్తుతం సుకుమార్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక అంతకుముందు ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల జల్లు కురిపించారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఒక అద్భుతం. ఆర్ఆర్ఆర్ టీం మొత్తానికి హ్యాట్సాఫ్.. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Recent Comment