యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కథానాయకుడుగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుండగా.. ఒక్క కట్ కూడా లేకుండా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది.
ఇక తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రమోషనల్ ఈవెంట్స్ తో అభిమానులకు మరింత చేరువ కావాలని చిత్రబృందం యోచిస్తోంది. ఇక మరోవైపు, గని సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ మొత్తం దక్కినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సుమారు రూ.25 కోట్లకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. కాగా, ఉపేంద్ర‌(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), న‌వీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapati Babu) త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమాలో వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు.