ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న RRR మూవీ సక్సెస్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల గ్యాప్ తర్వాత సీనియర్ దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva) కాంబినేషన్‌తో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. చాలా రోజుల కిందటే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న సైతం వెలువ‌డింది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత స్వరాలు సమకూర్చనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్(Alia Bhatt) న‌టిస్తుంది. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇదిలావుంటే, ఆర్ఆర్ఆర్ సినిమాతో తనకు హిందీలోనూ ఎన్టీఆర్ కు మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. అందులో భాగంగానే ఈ సినిమాకి భారీ బడ్జెట్ ని కేటాయించబోతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా కోసం ఏకంగా 300 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.