ఫ్యామిలీ స్టార్ జగన్ మోహన్ రెడ్డి గారు.  ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రధానం గా వై ఎస్ వివేకానంద రెడ్డి మృతి చుట్టూ తిరుగుతున్నాయి. 

వై ఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, ఇప్పుడు వై ఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు కూడా సీఎం గారికి బహిరంగ లేక రాశారు.    షర్మిల గారు బాహాటంగానే జగన్మోహన్ రెడ్డి ని దులిపేస్తున్నారు. 

అవినాష్ రెడ్డి కి.  జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అంత మద్దతు ఇస్తున్నారు.  అవినాష్ రెడ్డి నిర్దోషి అయితే, అసలు దోషులు ఎవరు, ముఖ్య మంత్రి ఎందుకు ఈ విషయం పై మాట్లాడడం లేదు. అసలు ఎం జరిగింది. నిజా నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయి.  తోడబుట్టిన చెల్లెలు కట్టుకున్న చీరపైనా కూడా విమర్శలు చేసే స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దిగజారుతున్నాయి.

ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి పై దాడులు ఎందుకు జరుగుతున్నాయి.  బ్యాండ్ ఎయిడ్ ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఉంచుకోమన్నారా వైదులు…?!

జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు చెప్పారు.  ‘నేను విన్నాను.  నేను ఉన్నాను’.   మీ సునీత గారు, మీ షర్మిల గారు, మీ సౌభాగ్యమ్మ గారు చెపుతున్నది విన్నారా, మీరున్నారా

ఎన్నికలలో ప్రజా తీర్పు ఎటు వైపు.  షర్మిల లేక అవినాష్ రెడ్డి.  ఈ ఫామిలీ డ్రామా కు ముగింపు ఎక్కడ.  ఓటర్ మహాశయా నువ్వే దీనికి సమాధానం చెప్పాలి