సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట'( Sarkaru Vaari Paata ) . మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఒక్క పాట మినహా, మిగతా షూటింగ్ అంతా పూర్తి అయినట్లు ఇటీవలే చిత్రబృందం వెల్లడించింది. అలాగే ఈ సినిమా నుండి ఇక వరుస అప్డేట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
కాగా, మే 12న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ వ్యూస్ పరంగా ఇండియన్ సినిమాల్లో ఎవరూ సాధించలేని రికార్డులను సాధిస్తున్నాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ ‘సర్కారు వారి పాట’ సెన్సేషన్ క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సర్కారు వారి పాట మూవీ థియేట్రికల్ రైట్స్ నైజాం ప్రాంతంలో రూ.30 కోట్ల రూపాయలకు కోనుగోలు చేశారని సమాచారం. అలాగే ఆంధ్ర ప్రాంతంలో రూ.50 కోట్లకు కోనుగోలు చేశారని తెలుస్తోంది. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా కూడా అండగా ఉంటామని మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్‌కి హామీ ఇవ్వడంతో కళ్లుచెదిరే మొత్తానికి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడవుతున్నాయని సమాచారం.
Recent Comment