కోలీవుడ్‌ స్టార్ హీరో దళపతి విజయ్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా లెవ‌ల్లో ఏప్రిల్ 13న విడుద‌ల కానుంది.

అయితే తాజాగా ఈ చిత్రం మ‌రో అరుదైన రికార్డును సాధించింది. ఈ సినిమాలోని ‘అర‌బిక్ కుత్తూ’ సాంగ్ మ‌రో సెన్సేషనల్ రికార్డు సాధించింది. తాజాగా ఈ పాట 250మిలియ‌న్ల వ్యూస్‌ను సాధించి దక్షిణాది భాషల్లో అత్యంత వేగంగా 250మిలియ‌న్ల వ్యూస్ సాధించిన పాట‌గ “అర‌బిక్ కుత్తూ” సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట‌కు శివ‌కార్తికేయ‌న్ లిరిక్స్ అందించ‌గా, అనిరుధ్ పాడారు. కాగా, ఇప్పటికే చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో షైన్‌ టామ్‌ చాకో, సెల్వరాఘవన్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.