మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరజిక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్'(RRR).ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. ఇక ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన తొలిరోజున తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంతమేర కలెక్షన్స్ సాదించే అవకాశం ఉందని అందరు చర్చించుకుంటున్నారు.
అయితే ఇండస్ట్రి వర్గాల సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైన తొలి రోజే బాహుబలి 2 తొలి రోజు వసూళ్ల రికార్డులనుబ్రేక్ చేసేలా దర్శకుడు రాజమౌళి స్కెచ్ వేశాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలైన తొలి రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలుపుకుని దాదాపుగా రూ.60 కోట్ల కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.
Recent Comment