మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా సీనియర్ డైరెక్టర్ శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు విభిన్న పాత్రల్లో క‌నిపించ‌నున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరపై మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ అంజలి నటిస్తున్నట్లు సమాచారం.

రామ్ చరణ్‌ సరసన అంజలి నటించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్‌ తండ్రికొడుకులుగా కనిపంచనుండగా.. తండ్రి పాత్రలో రామ్‌ చరణ్‌కు జోడిగా అంజలి, కొడుకు పాత్రలోని రామ్ చరణ్‌ సరసన కియారా అద్వానీ నటించన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.