కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ‘ఎద‌గ‌రా ఎద‌గ‌రా అంటూ సాగే పాట విడుద‌ల‌వ‌గా దానికి చక్కటి స్పంద‌న లభించింది.

ఈ క్రమంలోనే తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి ‘ర‌ణ ర‌ణ ర‌ణధీరా’ అంటూ సాగే రెండో పాట‌ను విడుద‌ల చేశారు. ర‌ణ ర‌ణ ర‌ణధీరా..గొడుగెత్తె నీల గ‌గ‌నాలు..ర‌ణ ర‌ణ ర‌ణ‌ధీరా ప‌ద‌మొత్తె వేల భువ‌నాలు..ర‌ణ ర‌ణ ర‌ణధీరా త‌ల‌వంచె నీకు శిఖ‌రాలు..ర‌ణ ర‌ణ ర‌ణధీరా జేజేలు ప‌లికే ఖ‌నిజాలు’ అంటూ సాగే ఈ పాటకు ర‌వి బ‌స్రూర్ సంగీత స్వరాలూ సమకూర్చారు. అలాగే రామజోగయ్య శాస్త్రి అందించిన పవర్ ఫుల్ లిరిక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇదిలాఉంటే, ‘కేజీఎఫ్-2’ మూవీ బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించబోతున్నట్టు తెలుస్తోంది. తొలి రోజే దాదాపుగా రూ. 40కోట్ల వసూళ్లను రాబట్టనున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.