యువ కథానాయకుడు రామ్‌ పోతినేని(Ram Pothineni) హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామి(Lingu Swamy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్‌’. (The Warrior) ఈ మూవీలో రామ్‌ పవర్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో అలరించబోతున్నాడు.
ఇప్పటివరకు పోలీస్‌ పాత్రలో రామ్‌ కనిపించ్లేదు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఈ సినిమాలో రామ్ సరసన కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ‘ది వారియర్‌’ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు చిత్రబృందం. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ‘ది వారియర్‌’ సినిమాని జూలై 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.