యంగ్ హీరో నాగశౌర్య (Naga Shourya) కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. (Krishna Vrinda Vihari) అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ సింగర్‌ షిర్లే సెటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించగా శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ‘కనిపించి వినిపించకుండా.. వినిపించి కనిపించకుండా..’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కాగా, ఈ సినిమాలో నాగశౌర్య భిన్నంగా, సరికొత్త రోల్ చేస్తున్నట్లు టీజర్ ద్వారా అర్ధమవుతోంది. ఇక శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ కృష్ణ వ్రింద విహారి ఏప్రిల్‌ 22న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకి సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తిస్తుండగా… ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస‍్తున్నారు. కాగా, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు.